
బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు
నందికొట్కూరు: బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వప్నప్రియదర్శిని అన్నారు. శుక్రవారం కోట వీధి, పగిడ్యాల రోడ్డు బైరెడ్డి నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కిశోర బాలికల సాధికారత–మనందరి బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కాల్పించారు. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో మాతా, శివు మరణాలకు, ఇతర ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. కార్యక్రమంలో బాలికల తల్లులు, ఎంపీహెచ్‌ఏఎఫ్ విజయలక్ష్మి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి లావణ్య, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మీదేవి, ఆశా వర్కర్ కృష్ణవేణి పాల్గొన్నారు.