
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో బోయ శ్రీను(14) అనే బాలుడు ఈతకు బావికి వెళ్లి మూచ్ఛరావటంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు బోయ శ్రీను(14) ఐదో తరగతి వరకు చదువుకొని బడి మానేసి కూలీ పనులకు వెళ్తున్నాడు. స్నేహితులతో కలసి బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. బావిలో ఈత కొడుతుండగా ఫిట్స్ రావటంతో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కేకలు వేయటంతో అక్కడ ఉన్నవారు బావిలో దూకి గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.