
కర్నూలులో మాక్ డ్రిల్
కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహణ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చేపట్టారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ రంజిత్ బాషా సూచనల మేరకు 4 గంటలకు కొండారెడ్డి బురుజు పరిసరాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్, డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను అధికారులు నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ద్వారా జారీ చేసిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం మాక్ డ్రిల్ కొనసాగింది. మాక్ డ్రిల్‌కు ముందు ప్రజలు భయాందోళనకు గురికాకుండా సమాచారం అందించారు. సైరన్ మ్రోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లే విధంగా సూచనలు ఇచ్చి చైతన్యపరిచారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ పొరుగు దేశంలో ఉద్రిక్తత నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, డీఆర్డీఓ సంస్థ, ఇండస్ట్రియల్ ఏరియా, మంత్రాలయం, కర్నూలు నగరంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో డిజాస్టర్డ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ అనుపమ, అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, కర్నూలు–1, 2 సీఐలు రామయ్య నాయుడు, నాగరాజరావు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ బాలరాజు, ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యుద్ధం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

కర్నూలులో మాక్ డ్రిల్

కర్నూలులో మాక్ డ్రిల్