
యాక్సిస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అధిక ఽరేట్లకు విద్యుత్‌ను యాక్సిస్ సంస్థతో కమీషన్ల కోసం ఒప్పందం కుదుర్చుకుని అడ్డంగా దొరికిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబునాయుడుపై ఉందని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అథితి గృహం ఆవరణలో బుధవారం ఆలూరు మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కె.మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో యూనిట్ విద్యుత్‌కు రూ.2.49 పైసలకే కేంద్ర ప్రభుత్వసంస్థ సెకీతో ఒప్పందం కుదర్చుకుంటే నాటి టీడీపీ నేతలు అడ్డగోలుగా విద్యుత్‌ను కొనుగోలు చేశారని ఆరోపిస్తూ..అమెరికా అధికారులు ఎప్పుడైనా జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పచ్చమీడియాతో పిచ్చిరాతలుగా రాయించారని మండిపడ్డారు. ప్రస్తుతం యాక్సిస్ సంస్థతో యూనిట్‌కు రూ.4.60 ప్రకారం కొనుగోలు చేయడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి నేడు ఎడాపెడా పెంచేస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందన్నారు. హొళగుంద నుంచి ఢనాపురం గ్రామ బీటీ రోడ్డు పనులను పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే.గిరి, మండల కో–కన్వీనర్ వీరేష్, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు బోయ ఎల్లమ్మ, జీరా నాగమ్మ, మాజీ ఎంపీటీసీలు,భాస్కర్,నాగేంద్ర ఐటీ, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు వరుణ్, రాజ్, హనుమంతప్ప, యల్లప్ప, వీరేష్,రామన్న, మల్లయ్య, జీరాగౌడు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అవినీతికి పరాకాష్టి
నాడు సెకీ ఒప్పందంపై
కూటమి నేతల కారుకూతలు
ఎమ్మెల్యే విరూపాక్షి