ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా
నేను పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలన్న తపనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి 589 మార్కులు తెచ్చుకున్నాను. మా అన్న ఉసేన్‌వలి సైతం ట్రిపుల్ ఐటీలోనే బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
– ఉసేన్‌బాష, పదవ తరగతి
మండల టాపర్, కోవెలకుంట్ల
పది ఫలితాల్లో
578 మార్కులు వచ్చాయి
మాది మధ్యతరగతి కుటుంబం. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాను. గత నెలలో విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 578 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచాను. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. – కరిష్మ, కోవెలకుంట్ల
విద్యార్థులు దరఖాస్తు
చేసుకోండి
2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను దరఖాస్తులు చేసుకోవాలి. డోన్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 119 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 6,280 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,813 మంది విద్యార్థులు వివిధ గ్రేడుల్లో ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
– వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డీఈఓ, డోన్
ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా
ట్రిపుల్‌ఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా


