కేడీసీసీ బ్యాంకులో పిటిషన్ల గోల!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పిటిషన్‌ల పర్వం సాగుతోంది. తమ లక్ష్యాలకు అడ్డం పడుతున్నారనే అనుమానం ఉన్న అధికారులకు పిటిషన్‌ల ద్వారా చుక్కలు చూపుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకులో పనిచేస్తున్న సీనియర్ అధికారుల పేరుతోనే పిటిషన్‌లు నేరుగా ఆప్కాబ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలల కాలంలో దాదాపు 100 వరకు ఇలాంటి పిటిషన్‌లు వెళ్లినట్లు సమాచారం. బ్యాంకుకు కొత్త సీఈఓ వస్తున్నారంటే చాలు ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా పిటిషన్‌లు వెళ్తుండటం గమనార్హం. పిటిషన్‌లు మంచి భాషతో పెడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కానీ, కుటుంబ సభ్యులను దా రుణంగా కించపరుస్తూ బూతులతో నింపేస్తుండటం అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు కొద్ది నెలల క్రిత మే పోలీసులకు పిర్యాదు చేశారు. అయినప్పటికీ వీటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించలేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నట్లు చర్చ జరుగుతోంది.
మహిళల జీవనోపాధికి రుణాలు
● డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళల జీవనోపాధిని అభివృద్ధికి చేసేందుకు రుణాలు ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,898.15 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 954 గ్రామైక్య సంఘాలు, 25 మండల సమాఖ్యలు ఉన్నాయన్నారు. మొత్తం 32,572 ఎస్‌హెచ్‌జీలు ఉండగా.,. ఇందులో 3,30,044 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి తదితర వాటి కింద రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
‘ఉపాధి’ నిధులతో
పండ్లతోటల అభివృద్ధి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పండ్లతోటలను అభివృద్ధి చేసుకోవచ్చని డ్వామా పీడీ వెంకటరమణయ్య తెలిపారు. ఇందుకు అర్హులైన రైతులను గుర్తించాలన్నారు. కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులకు ఈ నెల 17 నుంచి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డ్వామా పీడీ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరంలో 6,750 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. మొత్తంగా 17 రకాల పండ్ల తోటల సాగుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదనపు పీడీ మాధవీలత, ఏపీడీలు పాల్గొన్నారు.
3,075 స్పౌజ్ పింఛన్లు
మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 3,075 మంది వితంతు మహిళలకు పింఛన్లు మంజూరయ్యాయి. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో వృద్ధాప్య పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు వితుంతు పింఛన్లు మంజూరు చేసింది. ఈ జాబితాలను ప్రభుత్వం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపగా.. వీటిని ఎంపీడీఓలు, ము న్సిపల్ కమిషనర్లు, వార్డు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు పంపారు. వితంతు పింఛను మంజూరుకు ఆయా సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు వెంట నే డెత్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలన్నారు. నంద్యాల జిల్లాకు 3,169 పింఛన్లు మంజూరయ్యాయి.


