
బంగారుపేట సారా స్థావరంపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలులోని బంగారుపేట కేసీ కెనాల్ గట్టు పొడవున ఉన్న నాటుసారా స్థావరంపై సివిల్, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే రెండో పట్టణ పోలీసులు, కర్నూలు ఎకై ్సజ్ పోలీసులు పెద్ద ఎత్తున బంగారుపేటకు చేరుకోవడంతో ప్రజలు ఏమి జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు నాగరాజరావు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, కృష్ణ తదితరులు ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు నుంచి ఆనంద్ థియేటర్ వరకు దాదాపు కిలోమీటర్ పొడవున నాటుసారా స్థావరాలపై దాడులు జరిపి బట్టీలను ధ్వంసం చేశారు. 1,350 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసి 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నీలి షికారి భాగ్యమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలన ఆవశ్యకతను, సారా వినియోగం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వార్డు ప్రజలకు వివరించారు.
– 65 లీటర్ల నాటు సారా సీజ్