నాణ్యత బాగున్నా ధర తగ్గింది
మేము 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాం. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. అధిక వర్షాల వల్ల పంట దిగు బడి తగ్గింది. మామూలుగా అ యితే ఎకరాకు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. అయితే 3 క్వింటాళ్లు మించలేదు. మార్కెట్‌కు 32 క్వింటాళ్లు తెచ్చాం. తేమ శాతం 17 మాత్రమే ఉంది. వ్యాపారులు రూ.6,350 ధర మా త్రమే వేశారు. అడిగితే ఇష్టమైతే అమ్ముకో.. లేదంటే వెనక్కి తీసుకుపొమ్మన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను అడ్డగోలుగా తగ్గిస్తున్నారు. – నాగరాజు, బొల్లవానిపల్లి, తుగ్గలి మండలం


