
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కర్నూలు (హాస్పిటల్): ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన వార్షిక పరీక్షల్లో కర్నూలు మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని పీజీ వైద్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కార్డియాలజీ విభాగంలో మహేష్ పునుగుపాటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఆదిత్య, రంగవేణి సమాన మార్కులతో నెఫ్రాలజీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, కిషన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో స్టేట్ థర్డ్ ర్యాంకు, హిమజ యూరాలజీ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించారు. వీరిని సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంచి పేరున్న కర్నూలు మెడికల్ కళాశాల పేరును ఈ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి నిలబెట్టారని కొనియాడారు. కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో మొత్తం 9 మంది పరీక్ష రాయగా అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, అందులో ఐదుగురికి స్టేట్ ర్యాంకులు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభమైనప్పటి నుంచి కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, యూరాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సీతారామయ్య, ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ మంజుల బాయి, నెఫ్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ అనంత్, గ్యాస్టో ఎంట్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ మోహన్‌రెడ్డి అభినందించారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు

సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ

సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ

సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ

సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ