ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
నందికొట్కూరు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు. సోమవారం సబ్‌జైల్‌ను ఆయన తనిఖీ చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఖైదీలు కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలన్నారు. ఏమైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రందించాలన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100కు సమచారం తెలియజేయాలన్నారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేక జైలులోనే ఉన్నామని తెలియజేయడంతో విచారించి బెయిల్ మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైదీలకు అందించే ఆహారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్‌కుమార్, సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
సారా తయారీదారులపై బైండోవర్ కేసులు
కర్నూలు: ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండాలో 16 మంది సారా తయారీదారులపై ఎకై ్సజ్ పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. పలుమార్లు నాటుసారా స్థావరాలపై దాడులు చేసి విక్రయ, రవాణాదారులను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ మార్పు రాకపోవడంతో గుమ్మితం తండా గ్రామానికి చెందిన బిలావత్ స్వామి నాయక్, బిలావత్ బాలు నాయక్, దేశవత్ రాముడు నాయక్, దశావత్ థౌరు నాయక్, లక్ష్మా నాయక్, రాము నాయక్, మల్యాల లక్ష్మీబాయి, మదిర సుభా నాయక్, ముదిరేచ బాలాజీ నాయక్, ఎం.కృష్ణా నాయక్, ఎం.సురేష్ నాయక్, ఎం.వాసు నాయక్, మున్నే నాయక్, రవి నాయక్, లక్ష్మీబాయి, ఎస్.వెంకటమ్మ తదితరులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ఎస్‌ఐ రెహనా ఆధ్వర్యంలో ఓర్వకల్లు తహసీల్దార్ ఎదుట హాజరుపరచి బైండోవర్ చేశారు.


