కంబోడియాలో కై లాస్‌రెడ్డి ప్రతిభ
● ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో
రజత పతకం
కొలిమిగుండ్ల: మలేషియాలోని కంబోడియాలో జరిగిన దివ్యాంగుల పారాత్రోబాల్ పోటీల్లో కొలిమిగుండ్లకు చెందిన గండా కై లాస్‌రెడ్డి ప్రతిభ చాటాడు. రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఇటీవలే కంబోడియాలో ఆసియా ఖండంలోని ఎనిమిది దేశాలకు చెందిన జట్లు ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. ఈపోటీల్లో భారత జట్టు రజత పతకం సాధించినట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. పారా క్రికెట్‌లో ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కై లాస్‌రెడ్డి.. జాతీయ స్థాయి పారాత్రోబాల్ పోటీల్లోను మంచి ప్రతిభ కనపర్చి భారత జట్టు రజత పతకం సాధించేందుకు దోహదపడ్డాడు. రజత పతకం కోసం భారత్, మలేషియా జట్లు పోటీ పడ్డాయి. కై లాస్‌రెడ్డి విజయవాడలోని గనులు, భూగర్బ శాఖలో అవుట్ సోర్స్ కింద టైపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆసియా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అండగా నిలిచిన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.


