
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
డోన్ టౌన్: చెట్టు కొట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. మల్యాల గ్రా మానికి చెందిన చంద్రశేఖర్ (45) పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గురువారం చంద్రశేఖర్, అతని కుమారుడు రమేష్, మరి కొంత మంది కలిసి పట్టణ సమీ పంలోని యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో చెట్టును కొట్టేందుకు కూలీకి వెళ్లారు. కొమ్మ లు కొడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగ తెగి చంద్రశేఖర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పొలం యజమాని చంద్ర, కూలీలను పనికి తీసుకెళ్లిన నాగరాజు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుడు కుమారుడు పోలీసులు ఫిర్యాదు చేశారు.