శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడిగులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో వేలాది మంది భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో క్షేత్ర వీధులు కిటకిలాడుతున్నాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు కన్నడ భక్తుల కోసం విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేశారు. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.
శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు


