కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బి.లక్ష్మీ నరసింహులు (దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జువాలజీ లెక్చరర్), ఉపాధ్యక్షుడిగా జేవీ రమణగుప్తా (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కర్నూలు ఇంగ్లిష్ లెక్చరర్), కార్యదర్శిగా కె.రామాంజనేయులు (ప్రభుత్వ జూనియర్ టౌన్ మోడల్ కాలేజీ, కర్నూలు, కెమిస్ట్రీ లెక్చరర్), జాయింట్ సెక్రటరీగా పి.డేవిడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కౌతాళం, కెమిస్ట్రీ లెక్చరర్), కోశాధికారిగా జె.రాహుల్ కుమార్ (ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, కర్నూలు), మహిళ కార్యదర్శిగా ఎస్.రేష్మా (ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీ, కర్నూలు), రాష్ట్ర కౌన్సిలర్‌గా పి.శ్రీనివాసులు(ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ), ఆర్.రవీంద్ర బాబు (ప్రభుత్వ జూనియర్ బాలురు కాలేజీ, కర్నూలు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా మహమ్మద్ వాయిజ్ ప్రకటించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.


