నిర్లక్ష్యానికి మందేది? | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి మందేది?

Mar 15 2025 1:47 AM | Updated on Mar 15 2025 1:46 AM

● విధి నిర్వహణలో అధికారి వేళాకోలం

గోస్పాడు: నంద్యాల జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాబా ఖలందర్‌ విధులకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తనిఖీలు, ఉన్నతాధికారుల సమావేశాలు.. అంటూ విధుల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయానికి తరచూ మెడికల్‌ షాపుల నిర్వాహకులు వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు. అయితే కార్యాలయంలో సిబ్బంది అటెండర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మాత్రమే విధుల్లో కనిపిస్తారు. రిలీవింగ్‌ సర్టిఫికెట్‌ కోసం, ఇప్పటికే ఉన్న మెడికల్‌ షాపులను ఒకచోటి నుంచి మరొక చోటకు మార్పు కోసం, కొత్తగా షాపు పర్మిషన్‌ కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని అక్కడికి వచ్చే వారు ఆవేదన చెందుతున్నారు. కింది స్థాయి సిబ్బందిని అడిగితే పనుల నిమిత్తం పెద్దసారు బయటకు వెళ్లారని, సార్‌ ఎప్పు డు వస్తారు తెలియదని చెబుతుండటం గమనార్హం. జిల్లా కేంద్రంలో ఓ అధికారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement