అధిష్టానాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

అధిష్టానాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు

Feb 8 2024 1:40 AM | Updated on Feb 8 2024 1:09 PM

- - Sakshi

మాట్లాడుతున్న బీవై రామయ్య

ఆస్పరి: పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎవ్వరిౖపైనెనా చర్యలు తప్పవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య హెచ్చరించారు. బుధవారం ఆయన ఆస్పరిలో జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆలూరు నియోజక వర్గంలో ఆస్పరి జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు, కొంత మంది సర్పంచులకు బెదరింపు కాల్స్‌ వచ్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. బెదిరించిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.

రెచ్చగొట్టే వారి పట్ల పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా నిలుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో సమావేశంలో జేసీఎస్‌ జిల్లా కన్వీనర్‌ తెర్నేకల్లు సరేంద్రరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు, పార్టీ నాయకులు కేశవరెడ్డి, మహానంది, నరసింహులు, దత్తాత్రేయరెడ్డి, పెద్దరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement