మహానందీశ్వరుడికి వెండి రుద్రాక్ష మండపం | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడికి వెండి రుద్రాక్ష మండపం

Published Tue, Dec 5 2023 5:30 AM

వెండి రుద్రాక్ష మండపాన్ని 
తీసుకొస్తున్న దాతలు 
 - Sakshi

మహానంది: మహానందిలో కొలువైన శ్రీమహానందీశ్వరస్వామివారికి నంద్యాలకు చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మారం వెంకట సుబ్బయ్య, కటుంబసభ్యులు రూ.25 లక్షలు వెచ్చించి 35 కిలోల వెండితో రుద్రాక్ష మండపం చేయించారు. ఈ మేరకు దాతలు సోమవారం రాత్రి మహానందికి చేరుకుని ఆలయ ఈఓ చంద్రశేఖర్‌ రెడ్డి, ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున రావు ఆధ్వర్యంలో వెండి మండపాన్ని అందించారు. వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికి ముందుగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి అలంకరించారు. దాతలకు స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు అందించి సత్కరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement