మెడికోలు మానసికంగా దృఢంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మెడికోలు మానసికంగా దృఢంగా ఉండాలి

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

మెడికోలు మానసికంగా దృఢంగా ఉండాలి

ఎస్‌సీఐపీ డైరెక్టర్‌ డాక్టర్‌ తేజవతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలని సూసైడ్‌ ప్రివెన్షన్‌ ఇండియా ప్రాజెక్ట్‌(ఎస్‌పీఐపీ) డైరెక్టర్‌ డాక్టర్‌ తేజవతి సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన 250 మంది విద్యార్థులకు బుధవారం ఎమోషనల్‌ ఎసెస్‌మెంట్‌ ఆన్‌ సూసైడ్‌ ప్రివెన్షన్‌ బై ఎడ్యుకేషన్‌(ఈఏఎస్‌ఈ) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఒత్తిడిని గుర్తించడం, ఆత్మహత్య ఆలోచనలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సహాయం అందించేందుకు 2023వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ తేజవతి మాట్లాడుతూ ప్రతి శనివారం అందుబాటులో ఉండే విద్యార్థులు మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్‌ కేంద్రం సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో సహాయం పొందేందుకు టెలి–మానస్‌ టోల్‌ ఫ్రీ 14416 నంబర్‌తో పాటు కళాశాల క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యుల ఫోన్‌ నంబర్లను కూడా విద్యార్థులు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.ప్రశాంతి, మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్‌ రాఘవరావు, డాక్టర్‌ లావణ్య, డాక్టర్‌ రామ్‌నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement