కృష్ణానదిలో 5.20 లక్షల చేప పిల్లల విడుదల | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో 5.20 లక్షల చేప పిల్లల విడుదల

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

కృష్ణానదిలో 5.20 లక్షల చేప పిల్లల విడుదల

ఇబ్రహీంపట్నం: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మండలంలోని తుమ్మలపాలెం ఘాట్‌ వద్ద బుధవారం కృష్ణానదిలో 5.20 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి సీఎస్‌ చక్రాణి మాట్లాడుతూ.. బొచ్చె, రాగండి, మృగాల తదితర రకాల చేప పిల్లలను నదిలోకి వదిలామని తెలిపారు. ఇవి పెరిగి ఒకటి లేదా రెండు కిలోల బరువుకు చేరిన అనంతరం మత్స్యకారులకు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. చిన్న చేప పిల్లలను పట్టుకునే సన్న కన్ను వలల వినియోగం చట్టవిరుద్ధమని, వాటి వల్ల చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని హెచ్చరించారు. నిషేధిత వలలను ఉపయోగిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్స్యశాఖ సహాయ సంచాలకుడు కిరణ్‌కుమార్‌, మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement