గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరం గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మచిలీపట్నం తనిఖీదారు కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో లెక్కించారు. 64 రోజులకు రూ.27,82,267, అమ్మవారి అన్నదాన హుండీ ద్వారా నోట్లు రూ.64280 వచ్చింది. అమ్మవారి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ఈఓ ఆకుల కొండలరావు సభ్యులు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది లెక్కించారు. దేవస్థాన సిబ్బంది, ఉయ్యూరు, గుడ్లవల్లేరు, వేమవరం సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు వరుణ యాగం..
దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అమ్మవారి సన్నిధిలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు చైర్మన్ మోహన్, ఈఓ కొండలరావు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగం, వరుణ జపం నిర్వహిస్తున్నామన్నారు.


