మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం | - | Sakshi
Sakshi News home page

మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం హాథిరాం బావాజీ మఠాన్ని పరిరక్షించాలి కొనసాగుతున్న నిమజ్జనాలు

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించి ఎంపీపీల పదవీ కాలం గురువారంతో ముగియనుండటంతో ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్‌ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ (అవనిగడ్డ), జిల్లా సహకార అధికారి (బంటుమిల్లి), ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ (బాపులపాడు), గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (చల్లపల్లి), జిల్లా పరిశ్రమల అధికారి (గన్నవరం), ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ (ఘంటసాల), ఇంటర్మిడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (గుడివాడ), బీసీ సంక్షేమాధికారి (గుడ్లవల్లేరు), ఔళిశాఖ అధికారి (గూడూరు), పంచాయతీరాజ్‌ ఈఈ (కంకిపాడు), జిల్లా ఎకై ్సజ్‌ అధికారి (కోడూరు), జిల్లా ఉపాధి కల్పనశాఖాధికారి (కృత్తివెన్ను), డ్వామా పీడీ (మచిలీపట్నం), వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్‌ (మోపిదేవి), సమగ్ర శిక్ష ఏపీపీ (మొవ్వ), జిల్లా మత్స్యశాఖ అధికారి (నాగాయలంక), జిల్లా అగ్నిమాపక అధికారి (నందివాడ), జిల్లా గిరిజన సంక్షేమాధికారి (పామర్రు), ఐసీడీఎస్‌ పీడీ (పమిడిముక్కల), దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ (పెడన), జిల్లా విద్యాశాఖాధికారి (పెదపారుపూడి), వ్యవసాయశాఖ అధికారి(పెనమలూరు), జిల్లా భూగర్భవనరుల శాఖా ధికారి (తోట్లవల్లూరు), జిల్లా ఫ్యాక్టరీల అధికారి (ఉంగుటూరు), జిల్లా ఉద్యానశాఖాధికారి (ఉయ్యూరు)లను నియమించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుపతి తిరుమలలోని చారిత్రక శ్రీ స్వామి హాథిరాం బావాజీ మఠం పరిరక్షణ కోసం బంజారా ప్రతినిధుల బృందం బుధవారం దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబును ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేసింది. తమ ఆరాధ్య దైవమైన హాథిరాం బావాజీకి శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని, బంజారా సంప్రదాయాలను కాపాడాలని, మఠం ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గతంలో వచ్చిన ఆరోపణలు, పత్రికా కథనాలను అందజేసి, వాటిని ప్రభుత్వ రికార్డులతో పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్‌, సంఘ రాష్ట్ర సెక్రటరీ జాటావత్‌ రాంబాబు పాల్గొన్నారు.

నెట్‌వర్క్‌: గణాధిపతుల విగ్రహ నిమజ్జనాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. బుధవారం జోరువానలోనూ గ్రామోత్సవాల నడుమ గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement