క్లుప్తంగా
ఎన్నికల షెడ్యూల్ ఇలా...
కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..
బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ
కృష్ణాజిల్లా
● స్థానిక సంస్థలకు జమకాని
స్టాంప్ డ్యూటీ
● కూటమి అధికారం చేపట్టిన
నాటి నుంచి అదే పరిస్థితి
● వైఎస్సార్ సీపీ పాలకవర్గం
ఉండటమే పాపం
● జెడ్పీ ఆధ్వర్యంలో అభివృద్ధి
పనులన్నీ బ్రేక్
● గత ప్రభుత్వంలో ఏటా నగదు జమ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ఈ నెల 21న నిర్వహించే శాంతిర్యాలీని విజయవంతం చేద్దామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో జిల్లాలో అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతేకాకుండా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21న నగరంలోని శిఖామణిసెంటర్ నుంచి శాప్ కార్యాలయం వరకూ నిర్వహించనున్న శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసేలా ప్రతి అనుబంధ విభాగం అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) నుంచి అరుదైన సత్కారం పొందారు. నిమ్‌హాన్స్‌లో సైకియాట్రీ పీజీ కోర్సును ప్రారంభించి 71ఏళ్లు పూర్తయిన సందర్భంగా మొదటిసారిగా ఫౌండేషన్ దినోత్సవం ఈనెల 17న నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్ హాన్స్‌లో పీజీ చేసి, వైద్య పరంగానే కాకుండా, పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఒక పూర్వ విద్యార్థిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ సత్కారం పొందేందుకు డాక్టర్ ఇండ్లను ఆహ్వానించగా, ఆ సభలో ‘ప్రొఫెషన్/ప్యాషన్’(వృత్తి/ప్రవృత్తి) అంశంపై ప్రసంగించినట్టు డాక్టర్ ఇండ్ల శుక్రవారం తెలిపారు. తాను 1977 నుంచి 82 వరకూ నిమ్‌హాన్స్‌లో పీజీ, డీపీఎం డిగ్రీలు చేసిన అనంతరం కొంతకాలం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో, పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ సైకియాట్రిస్టుగా సేవలు అందించినట్టు పేర్కొన్నారు. అనంతరం విజయవాడలో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సత్కారం పొందడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు.
ఇలా జరగాలి..
ఏడాదిగా జమ లేదు..
● పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలంటూ
ఏడాదిన్నరగా డ్రామాలు
● కుడి కాలువపై నాలుగు పంపుహౌస్‌లలో
12మోటార్లు షట్‌డౌన్
● పూర్తిగా మూతబడిన చివరి
రెండు పంపుహౌస్‌లు
● రెండు మోటార్లతోనే ఆయకట్టుకు
నీళ్లిస్తున్నామంటూ కవర్ చేస్తున్న
అధికారులు
● మేలుకోకపోతే 4,820ఎకరాల
ఆయకట్టుపై తీవ్ర ప్రభావం
జిల్లా పరిషత్‌కు నిధులు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా పరిషత్ నిధులతో పనులు చేస్తున్నారని కూటమి నాయకులు నిధులను కావాలనే ఆపుతున్నారు. స్టాంప్ డ్యూటీకి సంబంధించిన నిధులు జిల్లా పరిషత్‌కు ముఖ్యమైన ఆదాయ వనరు కావటంతో వాటిని కావాలనే నిలిపివేశారు. – ఉప్పాల హారిక, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌లో రైల్వేస్టేషన్‌లు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.


