గురువే.. బరువా? | - | Sakshi
Sakshi News home page

గురువే.. బరువా?

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

గురువే.. బరువా? దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.08కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.08కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు గాను ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా మొత్తం రూ. 3,08,81,091నగదు, 301 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు విదేశాలకు చెందిన కరెన్సీ కూడా భారీగా లభించినట్లు అధికారులు తెలిపారు. యూఎస్‌ఏకు చెందిన 1,840 డాలర్లు, యూఏఈకి చెందిన 870 దిర్హమ్స్‌, యూరప్‌కు చెందిన 215 యూరోలు, టర్కీకి చెందిన 610, ఒమన్‌ బైంసాలు 300తో పాటు ఆస్ట్రేలియా డాలర్లు 380, న్యూజిలాండ్‌ డాలర్లు వంద లభించినట్లు వివరించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి ఈవో శీనా నాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. ఆలయాల పునర్నిర్మాణానికి కృషి మైలవరం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మైలవరంలో రూ. 4కోట్లతో నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహ కల్యాణ మండ పాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్‌ ఎస్‌వీ సుధాకరరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మైలవరంలోని ఎస్‌వీ సుధాకరరావు నివాసంలో మంత్రి రామనారాయణరెడ్డి మాట్లాడుతూ 700 ఏళ్ల చరిత్ర కలిగిన మైలవరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ద్వారకాతిరుమల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఎస్‌వీఎన్‌ నివృతరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి అవనిగడ్డ/ఉయ్యూరు: ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కృష్ణాజిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు అన్నారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపోను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్గో రవాణా ద్వారా డిపో ఆదాయాన్ని పెంచేందుకు కార్గో సిబ్బంది మరింత కృషిచేయాలని సూచించారు. డిపో మేనేజర్‌ కె. హనుమంతరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ట్రాఫిక్‌ శ్రీలక్ష్మి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. అనంతరం ఉయ్యూరు ఆర్టీసీ డిపో, బస్టాండు ప్రాంగణాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. తాగునీరు, ప్రయాణికుల వసతులు, బేబీ ఫీడింగ్‌ రూమ్‌లను పరిశీలించారు. డిపో మేనేజర్‌ ఎం.ప్రసాద్‌ పాల్గొన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

న్యూస్‌రీల్‌

జిల్లాలో 942 సర్కార్‌ బడులు.. 5,091 మంది టీచర్లు

ముగిసిన పవిత్రోత్సవాలు

ఏటా నిర్వహించాలి..

కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

మూడేళ్లుగా జిల్లాలో

గురుపూజోత్సవం నిర్వహించని

విద్యాశాఖ

పురస్కారాలు అందుకోవటానికి

ఎదురు చూస్తున్న గురువులు

నిధులు లేక గురుపూజోత్సవాన్ని

నిర్వహించటం లేదని ప్రచారం

ఇది తమను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

బతికి సాధించాలంటున్న

మానసిక నిపుణులు

సమస్యకు పరిష్కారం

ఆత్మహత్య కాదని సూచన

ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే

చాలంటూ వివరణ

నేడు ప్రపంచ ఆత్మహత్యల

నివారణ దినోత్సవం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కనిపించకుండా పోయిన ఘటనపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 14వ బెటాలియన్‌ ఏపీఎస్పీ అనంతపురం ఎ కంపెనీలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.మధుబాబు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఈ నెల 6వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మరో సిబ్బంది సుధాకర్‌ గౌడ్‌తో కలిసి భోజనం చేయడానికి నగరంలోని ఓల్డ్‌ క్వార్టర్స్‌, మెస్‌ డార్మెటరీకి బైక్‌పై వెళ్లాడు. భోజనం అనంతరం ఫోన్‌ మాట్లాడుతూ బయటకు వెళ్లిన మధుబాబు తిరిగిరాలేదు. 7వ తేదీ ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉన్నా హాజరు కాలేదు. సెల్‌ఫోన్‌కు కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. అతని సొంత ఊరిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆయన భార్య వసుంధర కూడా మధుబాబు ఇంటికి రాలేదని స్పష్టం చేశారు. మధుబాబు కనిపించడం లేదని ఆర్‌ఎస్‌ఐ కె.వెంకటేశ్వర్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏటా ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపికై న గురువులు సత్కారాన్ని పొందటం పరిపాటి. కానీ ఎన్టీఆర్‌ జిల్లా మాత్రం అందుకు విరుద్ధం. జిల్లాలో ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కూటమి ప్రభుత్వం అందించటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లలో మూడు సార్లు ఉపాధ్యాయ దినోత్సవాలు వచ్చాయి. కానీ ఒక్క ఏడాది కూడా జిల్లా విద్యాశాఖ ఈ జిల్లాలో వేడుకలు నిర్వహించలేదు. అలాగే జిల్లా స్థాయిలో పురస్కారాలను ప్రదానం చేయలేదు. ఇది ముమ్మాటికీ గురువులను అవమానించటమేనంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్లుగా ఎదురుచూపులు..

రాష్ట్రంలో 2024 మే మాసంలో ఎన్నికలు జరిగాయి. జూన్‌ 12న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ తరువాత 2024, 2025, తాజాగా 2026 సెప్టెంబర్‌ ఐదో తేదీ మొత్తం మూడు సార్లు నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగలేదు. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేసి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. కనీసం పదేళ్ల అనుభవం కలిగిన సర్కార్‌ బడుల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. కానీ ఉపాధ్యాయ దినోత్సవ తేదీ దాటి ఐదు రోజులైనా ఇప్పటి వరకూ దాని ఊసు ఎత్తకపోవటంపై ఈ ఏడాది సైతం ఉపాధ్యాయ దినోత్సవం జరగదనే నిర్ణయానికి ఉపాధ్యాయులు వచ్చినట్లు సమాచారం.

నిధులు లేవంటూ వంకలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ జిల్లాలోని పాఠశాలల అభ్యున్నతికి ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఉపాధ్యాయలు చెబుతున్నారు. దానివల్ల విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని మార్లు ప్రతిపాదనలు పంపినా కూటమి ప్రభుత్వం స్పందించటం లేదు. ఆఖరికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించటానికి సైతం నిధులు లేక కార్యక్రమాన్ని నిర్వహించటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువులను గౌరవించే కార్యక్రమాన్ని సైతం నిధుల కొరతతో నిలుపుదల చేయటం తమను అవమానించటమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుకు సైతం ముందుకు రావడం లేదు..

ఈ ఏడాది సెప్టెంబర్‌ ఐదో తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పత్రికా ముఖంగా ప్రకటన చేశారు. వివిధ కేటగిరీల్లో సుమారుగా 50 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తారు. జిల్లా విద్యాశాఖ రెండు సార్లు ప్రకటన చేసినా ఇప్పటి వరకూ పట్టుమని 25 మంది సైతం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. గత సంవత్సరాలు అంతకు లోపే దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. జిల్లా విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఉపాధ్యాయులు సైతం ముందు కు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

● ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థిని ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఆత్మహత్యతో ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో వివిధ యజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,451 కొనసాగుతున్నాయి. అందులో 942 ప్రభుత్వ యాజమాన్య పరిధి అయిన ప్రభుత్వం, జెడ్‌పీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 5,091 మంది వివిధ క్యాడర్లలో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏటా మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజైన సెప్టెంబర్‌ ఐదో తేదీన జరిగే గురుపూజోత్సవం రోజున జిల్లాలోని ఎంపికై న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించాలి. కానీ ఈ సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో పూర్తిగా పక్కన పెట్టింది.

గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గడచిన మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం ముగిశాయి.

కారణాలు ఏమైనా 2024 నుంచి జిల్లాలో గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూసే ఉత్సవం ఇది. ఒక వేళ రాష్ట్ర స్థాయి వేడుకలు ఇక్కడ జరిగితే ముందో, వెనుక ఒక తేదీన నిర్వహిస్తే బాగుంటుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది నిర్వహిస్తామని చెప్పి సమావేశాన్ని సైతం నిర్వహించారు. కానీ ఎందుకనో ఇప్పటి వరకూ చర్యలు చేపట్టిన దాఖలాలు కనపడటటం లేదు.

– ఎ. సుందరయ్య,

జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement