నిత్యాన్నదానానికి విరాళాలు
u8లో
● అందుకే కొత్త పింఛన్లంటూ హడావుడి
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
దేవినేని అవినాష్
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వెళుతుంది.
తిరువూరు: కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపు ఆరోపించారు. ఇప్పటి నుంచే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు అధ్యక్షతన బుధవారం జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అవినాష్ మాట్లాడారు. ఇన్నాళ్లుగా లేనిది బీసీలపై కపట ప్రేమ చూపుతూ, తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా మంజూరు చేయని కొత్త పింఛన్లకు హడావుడిగా దరఖాస్తులు స్వీకరిస్తూ నానా హంగామా చేస్తోందని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తారన్నారు. అనంతరం పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులను అవినాష్ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ అనే బుక్‌లెట్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, తిరువూరు పట్టణ, మండల అధ్యక్షుడు రేగళ్ల మోహనరెడ్డి, తాళ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు.


