కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 పాఠశాలలకు దూరంగా.. రొయ్యల రైతుల ఆందోళన నిత్యాన్నదానానికి విరాళం సమైక్యత చాటిన పోటీలు –8లోu ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం తిరోగమనంలో ప్రభుత్వ విద్య

–8లోu

–8లోu

న్యూస్‌రీల్‌

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక రూ.60లక్షలతో నిర్మించిన జెడ్పీ అతిథిగృహం, సమావేశ మందిరం ప్రారంభం

జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో దిగజారిన విద్యార్థుల సంఖ్య మౌలిక సదుపాయాలు లేక అవస్థలు వెంటాడుతున్న ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్షరాస్యతపై తీవ్ర ప్రభావం

మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
పాఠశాలలకు దూరంగా..

7

రొయ్యలసాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ పోరంకి లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు.

భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్‌ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడలో సోమవారం

ప్రారంభమయ్యాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్‌ పర్సన్‌గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్‌, అన్నవరం ఎలిజిబెత్‌ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమవుతుందని సంఘ సంస్కర్తల ఉవాచ. అక్షరాస్యత కలిగిన సమాజం త్వరగా ప్రగతి బాట పడుతుందని పలువురు మేధావులు నిరూపించిన సత్యం. కానీ ఆ విద్యను అందించే విద్యాలయాలను కూటమి ప్రభుత్వం నిధానంగా నిర్వీర్యం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పేదలందరూ విద్యావంతులు కావాలని అప్పుడు నిజమైన ప్రగతి సాధ్యమని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగంలో అపూర్వమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తత్ఫలితంగా జిల్లాలో సర్కార్‌ బడి ప్రగతి పరుగులు తీసింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని విద్యారంగంలో దర్శనమిస్తున్నాయని విమర్శలొస్తున్నాయి.

సర్కారు నిర్లక్ష్యం..

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఎదురవుతున్న సమస్యల కారణంగా విద్యార్థులు సర్కార్‌ బడులకు దూరమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరంలో మొత్తం 1,309 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,317 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, విద్యార్థులు 92,141మంది కాగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాల సంఖ్య 1,309కి తగ్గింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 8 పాఠశాలలు తగ్గాయి. జిల్లాలోని 25 మండలాల పరిధిలో ఉన్న 1,309 ప్రభుత్వ పాఠశాలల్లో 21 పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో, 1,212 పాఠశాలలు ఎంపీపీ/జెడ్పీపీ యాజమాన్యంలో, 76 పాఠశాలలు మున్సిపల్‌ యాజమాన్యంలో ఉన్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 78,884 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 2,453 మంది, ఎంపీపీ/జెడ్పీపీ పాఠశాాలల్లో 64,255 మంది, మున్సిపల్‌ యాజమాన్యంలోని పాఠశాలల్లో 8,489 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఉపాధ్యాయుల కొరత..

జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ప్రధానంగా జిల్లాలోని విద్యాసంస్థల్లో మొత్తం 10,445 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసినా ఇంకా 524 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు గతేడాది నివేదికల్లో పేర్కొన్నారు. ఇటీవల తాత్కాలిక ఉపాధ్యాయుల కోసం జిల్లా విద్యాశాఖ ప్రకటన ఇచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో చేపట్టలేదు.

చివరి దశ ‘నాడు–నేడు’కు మంగళం..

విద్యారంగంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక ల్పంతో నాడు–నేడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లతో సర్కార్‌ బడులకు కొత్త రూపు తీసుకొచ్చారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో రెండు విడతలుగా రూ. కోట్లతో పనులు జరిపించారు. అయితే గడిచిన రెండున్నరేళ్లగా కూటమి చివరి దశ పనులకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

మౌలిక వసతులకూ నిధుల్లేవ్‌..

జిల్లాలో రోజువారి సమస్యలతో పాటుగా నిర్వహణ లేకపోవటంతో విద్యాసంస్థల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీలు, మెట్లు ఇలా పలు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులు పనులను గుర్తించి అంచనాలు తయారు చేశారు. ఆ అంచనాలను సర్వశిక్ష అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటి వరకూ ఆ నిధులు రాలేదని తెలుస్తోంది.

కార్పొరేట్‌ కోసమేనా?

కూటమి పార్టీల్లో ఉన్న పెద్దలు నిర్వహించే కార్పొరేట్‌ విద్యాసంస్థల కోసమే సర్కార్‌ బడులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను మౌలిక సదుపాయాలు లేని కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు పంపటానికి వెనుకంజు వేస్తున్నారు. ప్రైవేట్‌ సంస్థల్లో చేర్పిస్తే ఆర్థిక భారాలతో మధ్యలోనే నిలిపివేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులు అక్షరాస్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏవీ నాటి వెలుగులు..

గత ప్రభుత్వంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలు విద్యారంగ వికాసానికి అండగా నిలిచాయని నిపుణులు సైతం చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా జిల్లాలో విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరగటమే కాకుండా ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలకు విద్యార్థులు వలస బాట పట్టారు.

కృష్ణా జిల్లాలో మొత్తం పాఠశాలలు : 1,309

ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య : 78,884

గతేడాది విద్యార్థుల సంఖ్య : 92,141

ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు : 13,257

ఈ ఏడాది డ్రాప్‌ అవుట్లు : 2,360

విద్యార్థుల డ్రాప్‌అవుట్‌ను అరికడుతున్నామని విద్యాశాఖ చెబుతున్నప్పటికీ కృష్ణా జిల్లాలోని తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డ్రాప్‌బాక్స్‌ వివరాల ప్రకారం జిల్లాలో 4,299 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వీరిలో 1,939 మందిని తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురాగా, మరో 2,360 మంది ఇంకా పాఠశాలలు, కళాశాలల్లో చేరలేదు. అంటే డ్రాప్‌బాక్స్‌లో నమోదైన వారిలో సగానికి పైగా విద్యార్థులు ఇప్పటికీ చదువుకు దూరంగానే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement