విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉట్టి కొడుతూ సందడి చేస్తున్న యువత
బాల గోపాలా.. ముకుందా.. మురళీగానలోలా.. మురారీ.. రారా.. మము దీవించ మా ఇంటికి.. అంటూ భక్తలోకం ప్రార్థించింది. ముద్దులు మూటగట్టిన మురిపాల కన్నయ్యను చూసి పరవశించిపోయింది. గోకులంలో కేరింతలు కొట్టిన లీలా వినోదుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సుగంధాలు గుబాళింపగా.. కొన్నిచోట్ల బాలకృష్ణులు, బుల్లి గోపికమ్మల రూపాలలో చిన్నారులు చూడముచ్చటగా అలరించారు. యువత, చిన్నారులు ఉట్టి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


