జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గత సంవత్సరపు విజయాలను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా సమ గ్రాభివృద్ధికి ఎన్టీఆర్ జిల్లా టీమ్ పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో పాటు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026లో జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని విధాలుగా ముందంజలో నిలిపేలా కృషి చేయాలన్నారు. ఎట్ హోం సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఎట్ హోంలో చిన్నారుల నృత్య ప్రదర్శన
పగుళ్లు ఇచ్చిన మెట్ల మార్గంలోనే
భక్తుల రాకపోకలు
పట్టించుకోని ఆలయ అధికారులు
జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి


