ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి
విజయవాడ కల్చరల్: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాంఘిక నాటకాల ప్రసారాలను పునఃప్రారంభించాలని తపస్వి కల్చరల్ ఆర్ట్స్ కార్యదర్శి సూర్యదేవర జగన్నాథరావు అధికారులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. గతంలో ప్రసారమయ్యే ఈ నాటకాలను 12 సంవత్సరాలుగా నిలిపివేశారని పేర్కొన్నారు. నాటకాలను తిరిగి ప్రారంభించాలని ఆకాశవాణి ప్రోగ్రామ్ హెడ్ సుధాకర్ మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. నాటక రంగాకిచెందిన నటులు, దర్శకులు గంగోత్రి సాయి, సినీ నటుడు పిళ్లా ప్రసాద్, అనంత హృదరాజ్, వీర్ల ప్రసాద్, వెనిగళ్ల భాస్కర్, డాక్టర్ బొక్కిన జయప్రకాష్ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
మద్యం వద్దు.. ప్రాణం ముద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగి వేగంగా వాహనాలు నడపొద్దంటూ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ఎంజీ రోడ్డులో వాక్‌థాన్ నిర్వహించారు. ఇందిరాగాంధీ ముని సిపిల్ కార్పొరేషన్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ నిర్వహించిన ఈ వాక్‌థాన్‌ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, డీసీపీ షిరీన్‌బేగం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. 2025 సంవత్సవత్సరంలో జిల్లా పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అకుంఠిత దీక్షతో పనిచేశారన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగారని అభినందించారు. రోడ్డు ప్రమాద మరణాలను ఇంకా తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు, విద్యార్థులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ డైరీ ఆవిష్కరణ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులు అందరూ విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ కోరారు. యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 డైరీని చంద్రకళ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధాయయులు 2026లో మెరుగైన ఫలితాలకు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి తమ సంఘం దిక్చూచిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు మహేశ్వర వెంకటేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, కోశాధికారి కె.గంగరాజు, ఆడిట్ కమిటీ కన్వీనర్ అనంతకుమార్, నాయకులు బి.రమణయ్య, పి.రామారావు, ఎం. లలిత, ఎస్.పి.ఆర్.ఎస్.దేవ్, డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, పూర్ణాచంద్రరావు, ఉన్నం ప్రసాదరావు, స్వామిరెడ్డి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి
ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి


