ఏపీ ఎన్జీఓస్ కృష్ణాజిల్లా కమిటీ ఏకగ్రీవం
మచిలీపట్నంటౌన్: ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీ ఏకగ్రీంగా ఎన్నికై ంది. ఈడేప ల్లిలోని ఎన్జీఓ హోంలో మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆకూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా వి.సీతారామయ్య, కోశాధికారిగా పి.శోభన్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎస్.సునీల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పి.భాస్కర్, ఎం.ఎం.అలీ, ఎ.సునీల్ కుమార్, ఎ.భాస్కరరావు, కె.వి. వి.సురేష్‌బాబు, మహిళా ఉపాధ్యక్షురాలిగా జహీరున్నీసాబేగం, ఆర్గనైజింగ్‌సెక్రటరీగా ఆర్.హేమప్రకాష్, జాయింట్ సెక్రటరీలుగా ఎ.రమాదేవి, కె.వి.కోటేశ్వరరావు, ఎం.మధుబాబు, జి.చంటిబాబు, ఎస్.రమేష్, మహిళా జాయింట్ సెక్రటరీగా ఎం.రజిని, పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి పోటీగా నామినేషన్లు దాఖలవకపోవడంతో ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా రమేష్, రాష్ట్ర పరిశీలకుడిగా జానకి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నిక అనంతరం సంఘ నాయకులు, సభ్యులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. నూతన కమిటీ ప్రతినిధులను సంఘ సభ్యులు, ఉద్యోగులు పూలమాలలు, బొకేలతో సత్కరించారు.


