స్కానింగ్ పాయింట్‌లో ఇకపై ఉచిత లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రూ.500 టికెట్లపై ఉచితంగా ఇచ్చే లడ్డూలను ఇకపై స్కానింగ్ పాయింట్లో భక్తులకు అందజేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. శుక్రవారం అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా, వారికి ఉచిత లడ్డూలు ఇవ్వడం లేదని ఆలయ ఈఓకు ఫిర్యాదులు అందాయి. ఇదే అంశాన్ని సాక్షిలో ‘దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ప్రచురించింది. దీనిపై ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లతో పాటు మహా మండపం దిగువన టికెట్ల కౌంటర్లలో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో స్కానింగ్ పాయింట్‌లో టికెట్లను తనిఖీలు నిర్వహించిన అనంతరం టికెట్‌కు రెండు లడ్డూల చొప్పున అందజేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది.
స్కానింగ్ పాయింట్‌లో ఇకపై ఉచిత లడ్డూల పంపిణీ


