పరిశ్రమల స్థాపనకు కృషి
పెనమలూరు: పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. కానూరులోని అన్నే కల్యాణ మండపంలో మంగళవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా లోని పారిశ్రామికవాడల్లో మౌలికవసతులు కల్పిస్తామన్నారు. పరిశ్రమల కోసం భూములు కేటాయించి అనుమతులు తీసుకున్న యూనిట్ల స్థాపనకు పారిశ్రామికవేత్తలు చొరవతో ముందుకు రావాలన్నారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యలను రాతపూర్వ కంగా తెలిపితే పరిష్కారం కోసం సంబంధిత అధికారులను పంపిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రతి 20 మంది పారిశ్రామికవేత్తలకు ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తానమన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. మల్లవల్లి, వీరపనేనివారి గూడెం పారిశ్రామికవాడల్లో మౌలికవసతులు కల్పించాలని పారిశ్రామికవేత్తలు కోరారు. సిబ్బంది గృహాలకు ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలన్నారు. పారిశ్రామి కవాడల్లో కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్‌లు నిర్మించా లని కోరారు. దీనిపై ఐలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాల మంజూరుపై బ్యాంకర్లతో మాట్లాడుతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తన పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన వాటిని ప్రభుత్వానికి పంపుతానని కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, మల్లవల్లి పారిశ్రామికవాడ చైర్మన్ జి.రవికుమార్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అఽధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


