ఒంటి కన్నే దిక్కు...
ఒక కన్ను అసలు కనబడదు. అలాగే ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఒక కన్ను కనబడక రాత్రి పూట ఆటో తోలటం సాధ్యం కాదు. వచ్చే ప్రభుత్వ వికలాంగ పింఛను ఎంతో కొంత కుటుంబ అవసరాలకు దోహదపడేది. తీరా ఇప్పుడు ఆ పింఛను పీకేశారు. దీనికితోడు మహిళలకు ఉచిత బస్సుతో ఆటోలకు కిరాయిలు లేకుండా పోయాయి. మొత్తం కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా కూలబడి పోయింది.
–లుక్కా రెడ్డి వెంకయ్య, చింతలగుంట, గుడ్లవల్లేరు మండలం
చేతికి వేళ్లు లేకపోయినా కనబడని ఈ గుడ్డి ప్రభుత్వం దివ్యాంగ పింఛనును తొలగించింది. కనీసం వృద్ధాప్యంలో ఉన్నామన్న దయ కూడా లేకుండా పింఛను ఎలా తొలగిస్తారు. బిడ్డలు ఎంత చూసినా... ఈ వయసులో వైద్యంతో పాటు మందులకు వాడుకునే పింఛను సొమ్మును హఠాత్తుగా ఆపేస్తే ఎలా? ఈ వయసులో ఎవరు సాయం చేస్తారు. ఈ ప్రభుత్వానికి చేతులు, కాళ్లు లేనివారే కనబడటం లేదు. వేళ్లు లేని నా వంటివారు ఎక్కడ కనబడతారు?
–కొండా రాజేష్, గుడ్లవల్లేరు
ఒంటి కన్నే దిక్కు...


