
ఉద్యోగులకు అండగా ఉంటాం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఏపీ ఎన్‌జీఓ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలోని సంఘ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి 15 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న విద్యాసాగర్‌ను సంఘం నేతలు ఘనంగా సత్కరించారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
తొలుత విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న అంశాల పరిష్కారానికి తమ రాష్ట్ర కార్యవర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భవనారి వెంకటేష్‌బాబు, కొప్పొలు సుధాకరరావు, కోశాధికారి జి.ఎన్.వి.రత్నకుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ కాల పరిమితి(2022–2025) అక్టోబర్ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన మేరకు సంఘ బైలాస్ నందు మార్పులు చేర్పులు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించామన్నారు. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.పి.జగదీష్, ఆల్ ఇండియా ఉమెన్ వింగ్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ప్రసంగించారు. విజయవాడ 1,2,3 డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్‌జీఓ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్