
అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్కేటర్ల సత్తా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి కుమారి పి.చైత్ర దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. ఆస్ట్రేలియాలో ఈ ఆగస్టు 28వ తేదీ నుంచి ఆదివారం వరకు జరిగిన వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్–2025 (వరల్డ్ స్కేట్ ఓషేనియా) పోటీల్లో పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, ఇన్‌లైన్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డ్యాన్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. విజయవాడ నగరానికి చెందిన వి.హృతిక్ ఇన్‌లైన్ విభాగంలో బంగారు పతకం, పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డాన్స్ విభాగంలో బంగారు పతకం, సోలో డాన్స్ విభాగంలో సిల్వర్ పతకం సాధించారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ ఎల్లాప్రగడ, టీమ్ ఇండియా రోలర్ స్కేటింగ్ కోచ్ పి.సత్యనారాయణ వారిని అభినందించారు.

అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్కేటర్ల సత్తా