
● యూరియా కోసం రైతుల పడిగాపులు
యూరియా కోసం రైతులకు పడిగాపులు పడటం తప్పడం లేదు. గ్రామాల్లో సొసైటీల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద చాంతాడంత క్యూలైన్లలో నిలబడి తమ వంతు ఎప్పుడొస్తుందా అని గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. గన్నవరంలో ఓ ఎరువుల దుకాణం వద్ద ఈరోజు వందలాది మంది రైతులు ఎరువుల కోసం క్యూ కట్టారు. ఇచ్చే ఒకట్రెండు బస్తాల కోసం వ్యవసాయ పనులు మానుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వస్తోందంటూ వాపోయారు. పెడన మండలం నందమూరు సొసైటీకి గురువారం రాత్రి 550 యూరియా కట్టలు వచ్చాయన్న సమాచారంతో శుక్రవారం ఉదయమే వందలాది మంది రైతులు సొసైటీ వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసు బందోబస్తు పెట్టి రైతులకు టోకెన్లు జారీ చేసి వారినందరినీ హాల్లో కూర్చోబెట్టారు. టోకెన్ల వారీగా ఒక్కొక్కరిని పిలిచి వారికి యూరియా కట్టలు అందించేలా చర్యలు తీసుకున్నారు. – గన్నవరం/ పెడన

● యూరియా కోసం రైతుల పడిగాపులు