
ఎలీసా టెస్ట్‌తో నిర్ధారణ
స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారిని తరచూ చూస్తుంటాం. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష అందు బాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు.
– డాక్టర్ టి.వి.మురళీకృష్ణ,
జనరల్ మెడిసిన్ నిపుణుడు