
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పిద్దాం ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం ద్వారా కొత్త శకానికి నాంది అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం స్వాతంత్య్ర దిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్‌కు సర్వే పూర్తి
వివిధ రకాల స్టాల్స్
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పటమటలంక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శుక్రవారం యువ ఆంధ్ర చాంపియన్ షిప్ కబడ్డీ లీగ్ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు.
త్రివర్ణ పతాకం సగర్వంగా నింగికెగసింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఎల్లెడలా చాటింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన సమరయోధులకు జిల్లా ప్రజలు నిండుమనసుతో నివాళులర్పించారు. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు స్వాతంత్య్ర దిన సంబరాలను వేడుకగా జరుపుకొన్నారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలలో మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు,సిబ్బందికి ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రశంసాపత్రాలు అందజేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరిలో మరింత దేశభక్తిని నింపాలని భావిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి మంత్రి రవీంద్ర జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కృష్ణాజిల్లాకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారికి నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరి పాలన అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, నిరుద్యోగ యువతకు డీఎస్సీ నోటిఫికేషన్, దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, ప్రతి విద్యార్థికి రూ. 15 వేల ఆర్థిక సాయం తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం ద్వారా కొత్త శకానికి నాంది పలికామన్నారు. మహిళలకు సీ్త్ర శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శుక్రవారం నుంచి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 42 జాబ్‌మేళాలు రూపొందించి 2,204 మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లాలోని నాగాయలంకలో నిర్వహించిన జలయోగా కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం పొందటం ఆనందంగా ఉందన్నారు. రెవెన్యూ రంగంలో రీ–సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 502 గ్రామాలకు గానూ 309 గ్రామాల్లో 3.82 లక్షల ఎకరాలు రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. విద్యుత్‌శాఖ ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 2,222 మందికి రూ.75వేల వరకు రాయితీతో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. బందరు నార్త్ మండల పరిధిలో ఓడరేవు నిర్మాణ పనులు ఇప్పటివరకు 40 శాతం పూర్తయ్యాయన్నారు.మచిలీపట్నం,నిమ్మలూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ యూనిట్లలో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇటీవల పాకిస్థాన్‌పై జరిగిన ఆపరేషన్ సింధూలో సమర్ధంగా పనిచేసి పాకిస్థాన్ డ్రోన్లను నేలకూల్చటం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు.
7
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయిందని డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారని చెప్పటానికి తాను గర్విస్తున్నానన్నారు. జిల్లా అభివృద్ధికి సర్వదా కృషి చేస్తూ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం త్రివర్ణ రంగులతో ఉన్న బెలూన్లను, శాంతి కపోతాలను ఎగురవేశారు.
ఆయా శాఖలకు సంబంధించి శాఖాపరంగా చేస్తున్న ప్రగతి, పథకాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావు తదితరులు తిలకించారు. ఈ స్టాల్స్ ప్రదర్శనలో మొదటి స్థానం ఉద్యానశాఖకు రాగా, రెండో స్థానం హ్యాండ్‌లూమ్స్, మూడో స్థానం వ్యవసాయశాఖకు లభించాయి.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా