
మనసంతా మువ్వన్నెలే..
శ్రీకాకుళం(ఘంటసాల): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని ఘంటసాల, కొడాలి గ్రామాల్లోని మద్యం దుకాణాలు మూసివేయగా శ్రీకాకుళంలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. షాపు ప్రధాన ద్వారం తాళం వేసి దుకాణ వెనుక భాగంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరపడంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిర్భయంగా మందు షాపు నిర్వహిస్తుంటే ఎకై ్సంజ్ అధికారులు ఏమయ్యారంటూ పలువురు వాపోతున్నారు. మద్యం షాపు వెనుకే మందు అమ్మడంతో పాటు అక్కడ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అమ్మకాలు జరిగాయి. మద్యం ఎక్కడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిర్వాహకులకు బాగానే గిట్టిందని మందుబాబులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): లోక్ సభలో జాతీయ క్రీడల పాలన బిల్లు –2025 పై ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. స్థానిక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్–2025 కబడ్డీ లీగ్ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత శివనాథ్ మాట్లాడుతూ 2030లో ఒలింపిక్స్ నిర్వహణకు నేషనల్ బిడ్ దాఖలు చేస్తామని ఎంపీ అన్నారు. కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ప్రభావతి, కార్యదర్శి వై.శ్రీకాంత్, సంఘ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: ప్రతి భారతీయుడి మదిలో మువ్వన్నెల జెండా రెపరెపలే. వాడవాడలా శుక్రవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీటిలో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించిన స్వాతంత్య్రం అనంతరం అనేక అడ్డంకులను అధిగమించి నేడు వికసిత భారతదేశంగా ఆవిష్కృతమవుతోందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. యూనివర్సిటీలో వీసీ జాతీయజెండాను ఆవిష్కరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్‌ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ గంగాధరరావు జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయపతాకానికి సెల్యూట్ చేసి ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలని అప్పుడే సమాజానికి మంచి సేవలను అందించగలుగుతామని చెప్పారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రాంగణంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ కార్యాలయంలో..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్రమని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు , సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, కె.తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, ఎస్‌వీడీ ప్రసాద్, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు అధికారులు, ఇన్‌స్పెక్టర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

మనసంతా మువ్వన్నెలే..

మనసంతా మువ్వన్నెలే..

మనసంతా మువ్వన్నెలే..

మనసంతా మువ్వన్నెలే..