రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
పెడన: మచిలీపట్నం – గుడివాడ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగామ గ్రామానికి చెందిన పోలగాని పెదబోదయ్య(45), పోలగాని సాయి(23)లు గుడివాడ నుంచి పెడన వైపు వస్తున్నారు. వడ్లమన్నాడుకు చెందిన మరో ఇద్దరు గుడివాడ వైపు వెళ్తున్నారు. వీరి వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటోలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బోదయ్య మినహా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేసినట్లుగా సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు