ఇంటర్‌లో ప్రవేశాలకు హెచ్‌ఎంలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ప్రవేశాలకు హెచ్‌ఎంలు సహకరించాలి

Apr 22 2025 12:58 AM | Updated on Apr 22 2025 12:58 AM

ఇంటర్

ఇంటర్‌లో ప్రవేశాలకు హెచ్‌ఎంలు సహకరించాలి

మచిలీపట్నంటౌన్‌: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని విద్యార్థుల ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయులు సహకరించాలని ఇంటర్మీడియెట్‌ జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి, ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి సాల్మన్‌ రాజు కోరారు. స్థానిక లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సోమవారం మచిలీపట్నం అర్బన్‌, రూరల్‌ ప్రధానోపాధ్యాయుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో నైపుణ్యం కలిగిన విద్య బోధనా, అర్హత కలిగిన అధ్యాపకులు ఉండడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, రికార్డులు, బ్యాగ్‌లు మధ్యాహ్నం ఉచితంగా భోజన సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుందరలక్ష్మి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

జనరల్‌ బోగీలు నాటికకు ప్రథమ బహుమతి

గుడివాడటౌన్‌: కృష్ణా ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ గుడివాడ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో జనరల్‌ బోగీలు నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానం ఇది అతని సంతకం, తృతీయ స్థానం నాన్నా నేనొచ్చేస్తా, ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనగా చిగురు మేఘం ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 8 నాటికలు ఈ పోటీల్లో పాల్గొన్నాయన్నారు. నాటికలో పాల్గొన్న ప్రతి బృందానికి రూ.20 వేలు పారితోషికం, యువ కళాకారులకు 15 మందికి రూ.1,000 చొప్పున అందజేశామన్నారు. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6 వేలు, రూ.5 వేలు, రూ.4 వేలు, జ్యూరీ బహుమతి రూ.4 వేలు, ఇతర బహుమతులకు ఎంపికై న ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు  హెచ్‌ఎంలు సహకరించాలి 1
1/1

ఇంటర్‌లో ప్రవేశాలకు హెచ్‌ఎంలు సహకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement