పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ రేంజ్ కేంద్రంగా జరుగుతున్న లక్క అక్రమ దందాలో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట్ రేంజ్ అధికారి అనిల్‌కుమార్ తెలిపారు. శుక్రవా రం ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బొజ్జ చెట్లను నరికి అక్రమంగా లక్క సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో గస్తీ బృందాలను ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. జిల్లెడ గ్రామంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన లక్కను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లక్కను అక్రమంగా తరలిస్తున్న మురళీగూడ, కమ్మర్‌గాం, నందిగామ, అగర్‌గూడ గ్రా మాలకు చెందిన ఎనిమిది మందిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లక్క అక్రమ రవాణాపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని చెప్పారు. అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించి అటవీ సంపదకు నష్టం కలిగిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దా డుల్లో ఎఫ్‌బీవోలు సతీశ్, సంగదీప్, లచ్చన్న, శిరీష, విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


