ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో వీధి కుక్కల సంచారా న్ని తగ్గించి, వాటికి ఏర్పాటు చేసే ఆశ్రయాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రజల భద్రత, ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగజ్‌నగర్ మండలం కోసిన గ్రామ శివారులో ఆశ్రయాలను ఏర్పాటు చేసేలా అంచనాలు రూపొందించాలని తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభు త్వ కార్యాలయాలు, క్రీడా సముదాయాల్లో వీధి కు క్కల సంచారాన్ని నియంత్రించాలని, వాటిని షెల్ట ర్‌కు తరలించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతీ షెల్ట ర్‌లో అవసరమైన సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా జిల్లా వై ద్యారోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించాలని సూ చించారు. డీఎంహెచ్‌వో నాగేంద్ర, డీఈవో సచ్చి దానందచారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల అధికారులున్నారు.


