తిర్యాణి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాల విద్యార్థి కుంట సాయిదీక్షిత్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్ తెలిపారు. చ ర్లలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఏసీఎఫ్ అండర్–17 పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఆడి అద్భుత ప్రతిభ కనబరిచిన సాయిదీక్షిత్ తెలంగాణ జట్టులో స్థానం సా ధించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 25నుంచి గుజరాత్లో నిర్వహించనున్న జాతీయ స్థా యి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించననున్నట్లు తెలిపారు. జాతీయ స్థా యిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.


