నృత్యం చేస్తున్న యువతీయువకులు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని లుంబి ని దీక్ష భూమిలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు శుక్రవారం సాయంత్రం కళాకారుల నృత్య ప్రదర్శనలతో అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. శని, ఆదివారాల్లోనూ మహాసభలు కొనసాగనున్నాయి. శనివాం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, లుంబిని దీక్షా భూమిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆదివారం ప్రతినిధుల సభ ఉంటుంది. నాయకులు బండారి రవికుమార్, భూపాల్, రాజన్న, దినకర్, రాజేందర్, కృష్ణమాచారి, కార్తిక్, టీకానంద్, మాలశ్రీ, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


