రాజంపేట్‌ గ్రామాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

రాజంపేట్‌ గ్రామాభివృద్ధికి కృషి

Nov 28 2026 1:02 AM | Updated on Nov 28 2026 1:02 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: రాజంపేట్‌ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆదేశాల మేరకు శుక్రవా రం ఆసిఫాబాద్‌ మండలంలోని రాజంపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించారు. చేపట్టిన అభివృద్ధి పనులు, చికెన్‌, మటన్‌ మార్కెట్‌, ఇంకుడు గుంతలను డీఎల్పీవో ఉమర్‌ హుస్సేన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఇంటింటా ఇంకుడుగుంతలు నిర్మించుకోవా లని సూచించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా వచ్చే పనులను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఈవో దివ్య దేవరాజన్‌ను తాను జీపీ కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరగా డిప్యూటీ కమిషనర్‌ పంచాయతీ పర్యవేక్షణకు వచ్చినట్లు సర్పంచ్‌ పోచయ్య తెలిపారు. ప్రత్యేక నిధుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మౌనిక, కార్యదర్శి సాయికృష్ణ, వార్డు సభ్యులు ఆవిద్‌, కిశోర్‌, బిల్‌ కలెక్టర్‌ నాగేందర్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement