ఆసిఫాబాద్‌అర్బన్: మండల కేంద్రంలో క మ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి అనూష శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. స్థానికంగా తలెత్తే చిన్నచిన్న వివాదాలు, కుటుంబ, ఇతర సామాజిక సమస్యలను పరస్పర చర్యలు, సంప్రదింపు ల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలి పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నగేశ్, ఎస్సై సుబ్బారావు, ఎంపీవో ప్రశాంత్, రాయిసెంటర్ సర్‌మేడి మోతీరాం, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


