‘విద్యా ప్లస్‌’ సమర్థవంతంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘విద్యా ప్లస్‌’ సమర్థవంతంగా అమలు చేయాలి

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యా ప్లస్‌ బోధనను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యాప్లస్‌ బోధన తీరును విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేలా బోధన సాగించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం పాఠశాలలో మిషన్‌ అమృత్‌ జల్‌ పనులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలను సందర్శించి మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంఈవో సుభాష్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఆటపాటలతో బోధించాలి

కెరమెరి: చిన్నారులకు ఆటపాటలతో ఆహ్లాదకర వా తావరణంలో బోధించాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. మండలంలోని గోయగాం ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించా రు. ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మాట్లాడారు. పద్యాలు, పాటలు పాడించి వారితో ముచ్చటించారు. అనంతరం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. శుద్ధజలంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ఆడే ప్రకాశ్‌, ఎంపీడీవో సాయిరాంగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి మురళి, హెచ్‌ఎం మహేశ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement