రెబ్బెన: సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే సీఎంపీఎఫ్ పెన్షన్ రెన్యూవల్ చేసుకోవాలని సీఎంపీఎఫ్ రీజియన్ కమిషనర్ గోవర్ధన్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం డిజిటల్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రెన్యూవల్ చేసుకోవడంపై అవగాహన కల్పించారు. ప్రయోగాత్మకంగా సెల్ఫోన్లో పలువురు విశ్రాంత ఉద్యోగులు జీవన్ ప్రమాణ్ రెన్యూవల్ చేసి చూపించారు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు తమ మొబైల్ నుంచి సులభంగా సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్‌బాబు, ఎస్వోటూజీఎం స్వామిరాజు, సీనియర్ పర్సనల్ అధికారి రజినికుమార్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


