కెరమెరి: కేసులు పెండింగ్ ఉంచకుండా వేగంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించా లని ఎస్పీ నితిక పంత్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సోమవారం తని ఖీ చేశారు. రికార్డులు, కేసుల వివరాలు, ద ర్యాప్తులో పురోగతి, స్టేషన్ నిర్వహణ తదిత ర అంశాలను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలను ఓపిగ్గా వినాలని సూచించారు. కేసుల దర్యా ప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
చట్టప్రకారం సమస్యల పరిష్కారం
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసు ప్రజావాణి కార్యక్రమం ద్వారా బాధితుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరిస్తున్నామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


