ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్‌ఏ దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కాగజ్‌నగర్ పట్టణం నౌగంబస్తీకి చెందిన పోచమ్మ కోరింది. పిల్లలు తన పోషణను పట్టించుకోవడం లేదని, తన ఆస్తిని తనకు అప్పగించాలని జిల్లా కేంద్రంలోని నూర్‌నగర్‌కు చెందిన పాటిల్ జగన్నాథ్ వేడుకున్నాడు. ఆశవర్కర్‌గా తనకు అవకాశం కల్పించాలని వాంకిడి మండలం బెండారా గ్రామానికి చెందిన వేములవాడ హారిక దరఖాస్తు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిర్పూర్(యు) మండలం పాములవాడ గ్రామానికి చెంది న ఆత్రం అర్జుబాయి, డబుల్ బెడ్రూం ఇల్లు కేటా యించాలని కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన గజ్జలపల్లి స్వప్న వినతిపత్రం అందించింది. వ్యవసాయ భూముల్లో బావులు, బోర్లు ఏ ర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కెరమెరి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే భూమిని సమానంగా పంచి ఇవ్వలేదని, న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం బూర్గుడకు చెందిన మేకర్తి గోపాల్ ఫిర్యాదు చేశాడు.


